The Desk…Thulluru : అమరావతి అభివృద్ధికి అందరూ సహకరించాలి➖డాక్టర్ మనోజ్(అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి తండ్రి)

The Desk…Thulluru : అమరావతి అభివృద్ధికి అందరూ సహకరించాలి➖డాక్టర్ మనోజ్(అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి తండ్రి)

🟡 అమరావతి : తుళ్లూరు : ది డెస్క్ :

రాష్ట్ర రాజధాని అమరావతికి అందరూ సహకరించాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ కోరారు. ఆదివారం అమరావతిలో ఓ కన్స్ట్రక్షన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ రూ.116లు విరాళం అందించాలని పిలుపునిచ్చారు.

అక్కడున్న కన్స్ట్రక్షన్ ప్రతినిధులు, పూజరులు సైతం అమరావతికి క్యూ ఆర్ కోడ్ ద్వారా రూ.116 విరాళం అందజేశారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన.. వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి రెండెకరాల భూమిని అమ్మి అమరావతికి విరాళం అందజేసిన విషయం తెలిసిందే. ఆమెను అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా.. సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం విదితమే.