🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
అమ్మవారి సేవకు భక్తుల రూ.2.20 లక్షల విలువైన వెండి వస్తువుల సమర్పణ
భీమవరం…మావుళ్లమ్మవారి దేవస్థానంలో పూజా, వినియోగ నిమిత్తం భక్తులు వెండి సామగ్రిని సమర్పించారు. గొల్లవానితిప్పకు చెందిన కొప్పర్తి బేబీ, శ్రీ ఫణి అనీషా కుటుంబ సభ్యులు రూ.2.20 లక్షల విలువైన 766 గ్రాముల వెండి పళ్లెం, 200 గ్రాముల వెండి గిన్నె, ఉద్ధరిణిని అమ్మవారి సన్నిధికి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దాతలకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ దాతలను శేషవస్త్రంతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు ఉదీశి మీనాక్షి, మిర్తిపాటి గున్నేశ్వరరావు, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. దాతలకు అమ్మవారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. అమ్మవారి సేవలో భాగంగా వెండి పూజా సామగ్రిని సమర్పించిన దాతలను ఆలయ అధికారులు, అర్చకులు అభినందించారు.

