The Desk … Bhimavaram : 35–40 ఏళ్ల సేవకు గౌరవ వందనం

The Desk … Bhimavaram : 35–40 ఏళ్ల సేవకు గౌరవ వందనం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఘన సన్మానం

పశ్చిమగోదావరి జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ఎస్‌వీవీఎస్ కృష్ణాజీ (ఎస్‌ఐ), బి. జయరాజు (హోం గార్డ్)లను జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ రఘువీర్ విష్ణు ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

సందర్భంగా DSP మాట్లాడుతూ :

35 నుంచి 40 ఏళ్లపాటు ప్రజా రక్షణలో అంకితభావంతో సేవలందించి గౌరవప్రదంగా పదవీ విరమణ చేయడం అభినందనీయమన్నారు. పోలీసు కుటుంబంతో అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, పోలీసు అసోసియేషన్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.