నాయి బ్రాహ్మణ సంఘాలతో కలిసి పాలభిషేకం చేసిన ఎమ్మెల్యే సౌమ్య
🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ చిత్రపటాలకు నాయి బ్రాహ్మణ సంఘాలతో కలిసి పాలాభిషేకం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.
హర్షం వ్యక్తం చేసిన నాయి బ్రాహ్మణ సంఘాలు :
నాయి బ్రాహ్మణుల షాపులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నందుకు నాయి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కూటమి నేతలతో కలిసి హర్షం వ్యక్తం చేశారు.

PM, CM, DPTY CM లకు పాలభిషేకం :
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ :
నాయి బ్రాహ్మణుల జీవనోపాధికి ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ :
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రతి వర్గానికి అండగా నిలుస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘాల నాయకులు, కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Nandigama MLA Tangirala Soumya Hails Free Electricity for Nai Brahmin Community
In a heartwarming gesture, Andhra Pradesh government whip and MLA Tangirala Soumya joined Nai Brahmin associations in Nandigama to celebrate the provision of 200 units of free electricity per month to local barber shops. The event at the MLA’s office overflowed with joy as community leaders expressed profound gratitude.
Soumya led a milk abhishekam ceremony on portraits of Chief Minister N. Chandrababu Naidu, Deputy CM Pawan Kalyan, and Prime Minister Narendra Modi, symbolizing appreciation for the NDA government’s welfare initiatives.
Nai Brahmin leaders hailed the aid as a vital boost to their livelihoods, stating it would greatly ease their daily struggles. “This support from the government is immensely beneficial,” they affirmed.
Addressing the gathering, MLA Soumya emphasized, “The NDA coalition is committed to the welfare of Nai Brahmins and every section of society. Public welfare remains our sole aim.”
The program saw enthusiastic participation from community leaders, TDP-Jana Sena activists, and supporters.

