The Desk …Dendulur : ▪️స్వచ్ఛపదం కార్యక్రమం▪️పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ నిషేధించాలి

The Desk …Dendulur : ▪️స్వచ్ఛపదం కార్యక్రమం▪️పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ నిషేధించాలి

🔴 ఏలూరు జిల్లా : దెందులూరు మండలం : దుగ్గిరాల: ది డెస్క్ :

పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా.. గ్రామంలో అధికారులు చేసే ప్రతి పనీ ప్రజలకు చేరువ అయ్యే విధంగా దుగ్గిరాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛపథం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

ప్రజలకు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పడం మాత్రమే కాదని.. పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ ను నిషేదించాలని, స్వచ్ఛత కోసం ప్రభుత్వం స్వచ్ఛరథం ద్వారా చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఇంటింటికీ చేరువ అవుతున్న తరుణంలో… పంచాయితీ సిబ్బంది, కూరగాయల మొక్కలు, ఆకు కూరలు వేయాలన్నారు. రోడ్లపై ఉన్న దుమ్ము, ధూళి, చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి సాయి క్రిష్ణ, మాజీ సర్పంచ్ గుంజా క్రీస్తుమణి, మాజీ ఉప సర్పంచ్ చింతమనేని శివగోపాల్ పలువురు పాల్గొన్నారు.