🟡 ఏలూరు జిల్లా : ఏలూరు: ది డెస్క్ :

ఏలూరు నగరంలో విలీనమైన గ్రామాలకు సురక్షిత గోదావరి తాగునీరు అందించేందుకు అమృత్ 2.0 పథకం కింద కీలక అడుగులు పడుతున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. సోమవారం 27వ డివిజన్ చొదిమెళ్లలో రూ.1.65 కోట్ల వ్యయంతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ నీటి ట్యాంక్ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ మాట్లాడుతూ :
అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రహదారి, బోరు పనులకు రూ.57 లక్షల ఎంపీ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో రూ.1,300 కోట్లతో 12 రైల్వే ఓవర్బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతోందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ :
విలీన గ్రామాల్లో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించేందుకు రూ.299.37 కోట్లతో అమృత్ 2.0 కింద తాగునీరు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి విక్రమ్‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

