🟡 ఢిల్లీ/ఏలూరు : ది డెస్క్:
లోక్సభలో ఎంపీ పుట్టా మహేష్ ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి సమాధానం
ఏలూరు, నూజివీడు రైల్వే స్టేషన్లలో మరిన్ని సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించే అంశం పరిశీలనలో ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు బుధవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం ఏలూరు రైల్వే స్టేషన్లో 152 సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్, మెయిల్, సాధారణ రైళ్లు ఆగుతుండగా, నూజివీడు స్టేషన్లో 18 సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్, సాధారణ రైళ్లు హాల్ట్ కలిగి ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
గత ఐదేళ్లలో ఈ రెండు స్టేషన్లలో అదనపు రైళ్ల హాల్ట్ కోరుతూ ప్రజాప్రతినిధులు, ప్రయాణికుల నుంచి రైల్వే బోర్డు, జోనల్, డివిజనల్ కార్యాలయాలకు పలు ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ, ట్రాఫిక్ పరిస్థితులు, కార్యాచరణ సాధ్యత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం అదనపు హాల్ట్లపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

