భీమవరం/చీపురుపల్లి : ది డెస్క్ :
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు గురువారం చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి మండలాల్లో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అధికార గణంతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా రానున్న కార్యక్రమాల విజయవంతానికి చేపట్టాల్సిన జన సమీకరణ ఏర్పాట్లపై నాయకులు, కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. గ్రామాల వారీగా పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
కార్యక్రమాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సమర్థవంతమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ పర్యటనలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

