The Desk… Bhimavaram : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ వినియోగానికి పిలుపు

The Desk… Bhimavaram : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ వినియోగానికి పిలుపు

🟡 ప.గో. జిల్లా : భీమవరం : ది డెస్క్ :

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రజలందరూ తమ రోజువారీ పనులను సాధ్యమైనంత వరకు సైకిళ్లపై నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు భీమవరం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

కాలుష్య నియంత్రణతో పాటు పర్యావరణ పరిరక్షణకు సైకిల్ వినియోగం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లాలోని ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.

Call for Bicycle Usage on World Environment Day

On the occasion of World Environment Day, TDP State Secretary Kolla Nageswara Rao (KNR) appealed to the public to carry out their daily activities, as far as possible, by using bicycles on Thursday.

Responding to the call given by
Chief Minister N. Chandrababu Naidu, he urged TDP cadres and the people of the Bhimavaram Assembly constituency to actively participate in this initiative.

He stated that the use of bicycles would contribute significantly to environmental protection by reducing pollution and promoting sustainable transportation.

On this occasion, he extended his congratulations on the completion of two years in office of the NDA Government at the Centre under the leadership of Prime Minister Narendra Modi, and the NDA Government in Andhra Pradesh under the leadership of Chief Minister N. Chandrababu Naidu. He also conveyed his best wishes to the public representatives of the district.