The Desk … Vunguturu : యోగాంద్ర పోటీల్లో మెరిసిన నారాయణపురం నాగసాయి.. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం

The Desk … Vunguturu : యోగాంద్ర పోటీల్లో మెరిసిన నారాయణపురం నాగసాయి.. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : నారాయణపురం : ది డెస్క్ :

రాష్ట్ర స్థాయి యోగాంద్ర పోటీలలో స్లోగన్ విభాగంలో ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నాగసాయి(14) ప్రథమ స్థానం సాధించి ప్రతిభ చాటింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె ప్రదర్శించిన సృజనాత్మకతకు న్యాయనిర్ణేతలు అత్యుత్తమ గుర్తింపు ఇచ్చారు.

ఈ సందర్భంగా నాగసాయిని ఉంగుటూరు ఎంపీడీఓ జి.ఆర్. మనోజ్, డిజిటల్ అసిస్టెంట్ శ్రీరామ్ తదితరులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆమె సాధించిన విజయం నారాయణపురం గ్రామంతో పాటు ఉంగుటూరు మండలానికి గర్వకారణమని పేర్కొన్నారు.