ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
కలిదిండి మార్కెట్ యార్డు చైర్మన్గా కురేళ్ల ఏడుకొండలు, వైస్ చైర్మన్గా వేల్పూరి వెంకటేశ్వరావు (నానాజీ) ఎన్నికైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ వారిని ఘనంగా సన్మానించారు.
కైకలూరు మండలం ట్రావెలర్స్ బంగ్లాలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్రావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

