🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

రూ.41.70 లక్షల సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ సాయం పంపిణీ
ఇప్పటివరకు 702 మందికి రూ.6.16 కోట్ల ఆర్థిక భరోసా
పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులు, ఎల్వోసీ కాపీలను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా రూ.33.29 లక్షల విలువైన 40 సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు రూ.8.41 లక్షల విలువైన 3 ఎల్వోసీ కాపీలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్న ఆయన, ఇప్పటివరకు నియోజకవర్గంలో 702 మందికి రూ.6.16 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ సాయం అందించినట్లు వెల్లడించారు. అదనంగా ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాల ద్వారా రూ.1.50 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు.
పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మందికి కొత్త ఆశలను కల్పిస్తున్నాయని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.

