🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :

మండలంలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎంపీపీ పలువురు ఎంపీటీసీ సభ్యులు పలువురు తాజా మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీపీ గంట శ్రీలక్ష్మి మాట్లాడుతూ :
ఐదు సంవత్సరాలలో సర్పంచ్ లు అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు మన్ననలు పొందారని అయితే మధ్యలో కరోనా సమస్య వల్ల చాలామంది సర్పంచ్ లు చాలా అభివృద్ధి పనులను చేయలేకపోయారని అయినప్పటికీ తమ పదవీకాలంను పూర్తిస్థాయిలో ముగించుకుని గొడవలేమీ లేకుండా ప్రజలకు సేవలు అందించినందుకు తాజా మాజీ సర్పంచ్ లందరికీ అభినందనలు తెలియజేశారు. అనంతరం సభకు విచ్చేసిన తాజా మాజీ సర్పంచ్ లను జడ్పిటిసి సభ్యులు లక్ష్మి, ఎంపీపీ మండల పరిషత్ సిబ్బంది దుస్సాలువాతో సత్కరించారు..
ఈ సందర్భంగా ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ మాట్లాడుతూ :
సర్పంచ్ హోదాలో వారు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం 2025 – 26 సంవత్సరానికి పంచాయతీ పనులు వసుల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పదిమంది పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో మనోజ్,ఎంపీపీ, జడ్పిటిసి, సత్కరించి జ్ఞాపకలను అందజేశారు. అదేవిధంగా ఇటీవల డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతిపొంది పోలవరం జిల్లా మారేడు మండలానికి బదిలీ కాబడిన నాచుకుంట పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ ను దుస్సాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పీటీసిలతోపాటు పలువురు ఎంపీటీసీ సభ్యులు, తాజా మాజీ సర్పంచులు డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Unugutur Mandal Celebrates Panchayati Raj Day in Style
Unuguturu Mandal in Eluru District hosted a grand National Panchayati Raj Day event on Friday afternoon at the Mandal Parishad office, marking the 73rd Constitutional Amendment’s legacy. Attended by JDPTC MPP Ganta Srilakshmi, several MPTC members, and outgoing former sarpanches, the program highlighted rural governance achievements.
MPP Ganta Srilakshmi praised former sarpanches for executing development works over five years, despite COVID disruptions, and commended their dispute-free tenures serving the public. She led tributes, honoring them with shawls alongside JDPTC members Lakshmi, MPDP staff.
MPDO G.R. Manoj lauded the sarpanches’ contributions and felicitated 10 panchayat secretaries for top revenue collection in 2025-26, gifting mementos. He also bid farewell to promoted Deputy MPDO-cum-panchayat secretary Prasad, transferred to Polavaram district’s Maredumandal, with shawls.
Other participants included MPPs, JDPTCs, MPTCs, former sarpanches, and Deputy MDOs, reinforcing local self-governance spirit.

