🔴 పోలవరం జిల్లా : రంపచోడవరం : ది డెస్క్ :
దివి నుంచి భువికి గంగను తీసుకొచ్చి ప్రపంచ మానవాళికి జీవం పోసిన మహర్షి భగీరథ వారిని అందరు స్మరించుకోవాలని ప్రోజెక్ట్ డైరెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. మహర్షి భగీరథ జయంతిని అధికారికంగా జరుపమని ప్రభుత్వం జీఓ జారిచేయడంతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు మేరకు జిల్లా గురువారం జిల్లా ద్వామా కార్యాలయం, రంపచోడవరంలో పీడీ ద్వామా తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆధ్వర్యంలో మహర్షి భగీరథ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.కార్యక్రమంలో ఏపీడీ రాంబాబు, ఏపీఓ సురేష్, సాంకేతిక సహాయకులు వీరన్న, జిల్లా రిసోర్స్ పర్సన్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

