The Desk … Vijayawada : నాగేంద్రను బలిగొన్న నాగేంద్రుడు

The Desk … Vijayawada : నాగేంద్రను బలిగొన్న నాగేంద్రుడు

🔴 విజయవాడ : ది డెస్క్ :

వంటగదిలో విషసర్పం – విగతజీవిగా…

ఇద్దరు చిన్నారులకు తీరని శోకం..

పూజించే ఆరాధ్య దైవమే – పాము రూపంలో కాటేసి.. కాటికి పంపిన వైనం

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రామలింగేశ్వర నగర్‌ గులాబీ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లోని వంటగదిలో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో పాము కాటుకు గురైన చిప్పల నాగేంద్ర కుమార్‌ మృతి చెందారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్న వయసులోనే కుటుంబ పెద్ద మృతి చెందడంతో, ఇద్దరు చిన్నారులతో కూడిన కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఆయన స్వగృహం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

మాజీ కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, నడకుదిటి సుబ్బరాజు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.