The Desk … Velerupadu : కడియాల పద్మ అనే నేను

The Desk … Velerupadu : కడియాల పద్మ అనే నేను

🔴 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గo : వీరులపాడు మండలం : పొన్నవరం : ది డెస్క్ :

పొన్నవరం పద్మగా ఆశీర్వదించండి

పొన్నవరం బిడ్డగా.. ప్రజల సేవకురాలిగా వస్తున్నా..!!

పొన్నవరం అభివృద్ధే లక్ష్యం…ప్రజాసేవే నా ఆశయం

పదవి కోసం కాదు.. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం

పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తా

గ్రామంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటా

ప్రతి ఇంటికీ అండగా.. ప్రతి సమస్యకూ పరిష్కారంగా

అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

➖కడియాల పద్మ
(సర్పంచ్ అభ్యర్థి)

పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని వీరులపాడు మండలం పొన్నవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కడియాల పద్మ స్పష్టం చేశారు. పదవులు లేని సమయంలోనూ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ కుటుంబం నిరంతరం ముందుండి పోరాడిందని పేర్కొన్నారు. గ్రామ సమస్యలను తమ కుటుంబ సమస్యలుగా భావించి, గ్రామ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేశామని తెలిపారు.

ఒక ఆడబిడ్డగా, అక్కగా, చెల్లిగా, అమ్మగా గ్రామ ప్రజల ముందుకు వస్తున్నానని, గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి సేవలందిస్తానని కడియాల పద్మ హామీ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తూ, అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట :

గ్రామ అభివృద్ధిలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని కడియాల పద్మ పేర్కొన్నారు. ముఖ్యంగా పొన్నవరం గ్రామానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పదో తరగతి చదువుకోవడానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. సర్పంచ్‌గా విజయం సాధించిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పదో తరగతి వరకు విస్తరించేందుకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అనుమతులు సాధించే వరకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అందరికీ అందుబాటులో.. అభివృద్ధిలో భాగస్వామిగా :

గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పాలన సాగిస్తానని పద్మ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే గ్రామ సమష్టి అభివృద్ధికే పెద్దపీట వేస్తానని తెలిపారు.

పొన్నవరం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తనకు ఒక అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలను కడియాల పద్మ అభ్యర్థించారు. ప్రజలు తనపై ఉంచే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.