🔴 పగో: తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

ప్రజా సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో నిర్వహించిన సమీక్షలో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, పారిశుధ్యం, డ్రైనేజీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
PGRS ఫిర్యాదులను పౌరుడి ఫొటోతో సహా ఎండార్స్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రత, సమయపాలనపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. మున్సిపాలిటీకి మంజూరైన 15 ఈ-ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

