The Desk … Tadepalligudem : తాడేపల్లిగూడెం 28, 32వ వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ విస్తృత తనిఖీలు

The Desk … Tadepalligudem : తాడేపల్లిగూడెం 28, 32వ వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ విస్తృత తనిఖీలు

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం.యేసుబాబు నేడు పట్టణంలోని 28వ మరియు 32వ వార్డులలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో భాగంగా వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ, కొత్తగా నిర్మిస్తున్న సి.సి రోడ్ల పనుల నాణ్యత, డ్రెయినేజీ వ్యవస్థను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు లేకుండా చూడాలని, పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్, డ్రెయిన్లలో పూడిక తీయించి, చెత్తను సకాలంలో తరలించాలని సిబ్బందికి సూచించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వార్డులలో మంచినీటి నమూనాలను సేకరించి పరీక్షలు జరిపి ఇంటి యజమానులకు నీటి శుభ్రత గురించి వివరించారు.

వేసవి కాలం దృష్ట్యా నీటి సమస్య లు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజల నుండి ఫిర్యాదులు రాకుండా చూడాలని కమిషనర్ సిబ్బందిని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, శానిటేషన్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tadepalligudem Municipal Commissioner Inspects 28th, 32nd Wards for Development Progress

Municipal Commissioner M. Yesubabu conducted extensive inspections in the town’s 28th and 32nd wards today, reviewing key development works.

Focusing on sanitation, ongoing CC road construction quality, and drainage systems, he directed engineering officials to ensure high standards, accelerate works, and meet deadlines without defects. Emphasizing cleanliness, he instructed staff to clear sludge from drains and remove waste promptly.

Prioritizing public health, the commissioner collected drinking water samples for testing and briefed residents on water purity. He warned staff to implement preemptive measures against summer water shortages and prevent public complaints.

Municipal engineering officials, sanitation workers, and ward secretariat staff accompanied him.