🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ప్రజా దర్బార్ లో తెలియజేసిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. గత టిడిపి హయాంలో టిడ్కో గృహాల కోసం డబ్బులు కట్టినవారికి ఈ నెలలో ఆ సొమ్మును వెనక్కిస్తామని, మూడవ దశలో వారికి ఇళ్లు కూడా కేటాయిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఉదయం నుంచి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ లో భాగంగా అందిన ప్రతి అర్జీని సమూలంగా పరిశీలించి, తక్షణం సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఫోన్ ద్వారా అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ :
తాను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి ప్రతిరోజు ఏలూరులో ప్రజా దర్బార్ నిరంతరాయంగా కొనసాగుతోందని, ఎంతోమంది తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ దీనిలో అందిన సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ప్రజాదర్బార్ లో అధికంగా టిడ్కో గృహాలు, ఇంటి స్థలాలు, పెన్షన్లు ఇప్పించాలని ఎక్కువ మంది కోరుతున్నారన్నారు. టిడిపి హయాంలో టిడ్కో గృహాల కోసం పేదలు చెల్లించిన సొమ్మును ఈ నెలలో తిరిగి చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. డీడీలు చెల్లించిన వారు తమ సమీప సచివాలయంలో ఆధార్ కార్డు, డిడి జిరాక్సులు అందజేస్తే ఈ నెలలో డబ్బులు వెనక్కి ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. వీరందరికీ మూడో దశలో ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే జూన్ నెలాఖరుకు టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. కొత్త పెన్షన్ల కోసం ఎవరు కంగారు పడవద్దని, అర్హులందరికీ పెన్షన్లు అందజేసి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి గురువారం పవర్ పేట క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక మెడికల్ క్యాంపును ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. వివిధ రకాలైన పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి పవర్ పేట క్యాంపు కార్యాలయంలో 40 రకాల ఆరోగ్య టెస్టులు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే చంటి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్,
డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాస్, ఏలూరు నగర టిడిపి కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు బెల్లపుకొండ కిషోర్, పలువురు కార్పొరేటర్లు , క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.
Eluru MLA Badeti Chanti, also the TDP district president, assured refunds for TIDCO house applicants this month
Praja Darbar Highlights :
Hundreds from Eluru constituency gathered Friday at the MLA’s camp office, presenting petitions on housing, pensions, and sites. Chanti personally heard grievances, issuing spot instructions to officials via phone for immediate redressal.
The coalition government is committed to resolving every issue raised, he emphasized, noting daily Darbars since his election win.
TIDCO Housing Relief :
Applicants who paid during TDP regime for TIDCO houses will get refunds this month, Chanti promised. Submit Aadhaar and DD xerox at nearest secretariat; phase-3 houses allotted soon, with June handover targeted.
Welfare Promises :
No eligible person denied new pensions, he assured. Weekly free medical camps every Thursday at Power Pet office offer tests and drugs; biweekly Red Cross camps provide 40 health checks every 15 days.
Key Attendees :
AMC Chairman Mamillapalli Parthasarathi, Eda Chairman Peddaboyina Shivaprasad, Deputy Mayor Karri Srinivas, TDP city secretary Reddy Nagaraju, leaders Bellapukonda Kishore, corporators, cluster in-charges participated.

