The Desk… Tadepalligudem : పట్టణంలో తణుకు రోడ్ బస్టాండ్ దగ్గర స్వచ్ఛత బోర్డులను పరిశీలించిన ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్

The Desk… Tadepalligudem : పట్టణంలో తణుకు రోడ్ బస్టాండ్ దగ్గర స్వచ్ఛత బోర్డులను పరిశీలించిన ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

నిడదవోలులో జరుగుతున్న ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి వెళుతూ మార్గమధ్యంలో ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్ తాడేపల్లిగూడెంలోని తణుకు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సుందరీకరణ పనులను, స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర అవగాహన బోర్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో.. ఏర్పాటు చేసిన ‘వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్’, ‘వర్మీ కంపోస్ట్’, ‘జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్’ బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా పట్టణాల సుందరీకరణకు, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ :

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వడం, చెత్తను రోడ్లపై వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయడం ద్వారా పట్టణాలను స్వచ్ఛంగా ఉంచవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు, మున్సిపల్ అధికారులు, స్వచ్ఛ ఆంధ్ర సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కమిషనర్ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం :

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. “జలం – జీవం”

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” (SASA) కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెంలోని తణుకు బస్ స్టాండ్ రోడ్డు కెనాల్ బండ్ వద్ద మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

‘జలం – జీవం’ అనే భావనతో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ స్వయంగా చీపురు చేపట్టి సిబ్బందితో కలిసి కెనాల్ బండ్ వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి శ్రమదానం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తతో కాలువలు పూడుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని, దోమలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు.

సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ :

నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కాలువల్లో చెత్త వేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతాయని తెలిపారు. ‘జలం ఉంటేనే జీవం ఉంటుంది’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, స్వచ్ఛ ఆంధ్ర సాధనకు, నీటి వనరుల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి సుధాకర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సీతారాం, రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, శానిటేషన్ సూపర్వైజర్ సోమేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సెక్రటరీలు పాల్గొని కెనాల్ బండ్ ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు.

AP Swachh Andhra Chairman Inspects Cleanliness Boards in Tadepalligudem

En route to a key review meeting with Chief Minister Chandrababu Naidu in Nidavolu, AP Swachh Andhra Corporation Chairman Kommareddy Pattabhiram halted at Tanuku Road Bus Stand here to examine beautification efforts and Swachh Bharat-Swachh Andhra awareness boards.

Under Tadepalligudem Municipal Council’s initiative, he meticulously reviewed ‘Wet Waste Processing Unit’, ‘Vermi Compost’, and ‘Zero Waste Institutions’ displays. Praising the municipality’s drive for urban cleanliness and public awareness amid Swachh Survekshan surveys, Pattabhiram urged citizens: “Per Chief Minister’s directive, every citizen must contribute to a pristine Andhra Pradesh by segregating wet-dry waste and disposing only at designated spots.”

Municipal Commissioner M. Yesu Babu, officials, Swachh Andhra staff, and local leaders attended.

Municipal Commissioner Leads Clean-Up Drive Under ‘Swachha Andhra-Swarna Andhra’ Initiative

In a hands-on effort to promote water conservation, Municipal Commissioner yesubabu spearheaded a cleanliness drive at the Thanu Bus Stand road canal bund in Tadepalligudem as part of the prestigious “Swachha Andhra-Swarna Andhra” (SASA) program. Themed “Jalam – Jeevam” (Water is Life), the event saw the commissioner personally wield a broom alongside staff to clear plastic waste and debris clogging the canal.

Speaking on the occasion, yesubabu warned that polluted canals contaminate groundwater and breed mosquitoes, endangering public health. “Protecting water resources is everyone’s responsibility. Jalam untene jeevam untundi—water sustains life. Let’s all support Swachha Andhra,” he urged.

Participants included Manager Ravi Sudhakar, Assistant City Planner Sitaram, Revenue Officer Prasad, Revenue Inspector Ashok Kumar, Sanitation Supervisor Someswar Rao, municipal staff, and secretariat secretaries, transforming the area into a cleaner space.