🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో జనగణన-2027 కార్యక్రమం క్షేత్రస్థాయి పనులు మున్సిపల్ కమిషనర్ ఎం.యేసుబాబు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్యూమరేటర్లు మరియు జనగణన సిబ్బందితో కలిసి1వ వార్డులో ఇంటింటి సర్వే పనులను పరిశీలించారు. ఫేస్-1లో భాగంగా హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ వివరాల సేకరణ జరుగుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ :
జనగణన దేశ అభివృద్ధికి, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆధారమని, ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. సేకరించే సమాచారం పూర్తి గోప్యంగా ఉంచబడుతుందని, ప్రజలు ఎటువంటి అపోహలకు తావివ్వవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు అసిస్టెంట్ సిటీ ప్లానర్ సీతారాం, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జగదీశ్వరరావు, అసిస్టెంట్ ఇంజనీర్ హరీష్, G1గుమస్తా విజయ్, ఏఎస్ఓ రజిని, ఎనిమినేటర్ లు మరియు సూపర్వైజర్ లు పాల్గొన్నారు.
Census 2027 Fieldwork Kicks Off in Tadepalligudem Ward -1
Census-2027 fieldwork launched in Tadepalligudem Municipality’s 1st Ward under Municipal Commissioner M. Yesubabu’s guidance on Thursday.
The commissioner joined enumerators and census staff for door-to-door surveys, reviewing Phase-1 house listing and housing census data collection.
Addressing the team, Yesubabu emphasized that the census forms the backbone of national development and welfare schemes. He urged citizens to provide accurate information, assuring complete confidentiality and cautioning against misinformation.
Participants included Assistant City Planner Seetharam, Town Planning Officer Jagadeeshwar Rao, Assistant Engineer Harish, G1 Gumasta Vijay, ASO Rajini, enumerators, and supervisors.
The initiative aims for comprehensive demographic mapping ahead of 2027.

