పాలకొల్లు/భీమవరం : ది డెస్క్ :
ఆక్వా రైతులకు విద్యుత్‌ను యూనిట్‌కు రూ.1.50కే అందించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు ఎంతో ప్రయోజనకరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రైతు ప్రతినిధి కోళ్ల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) అన్నారు. మంగళవారం పాలకొల్లులో నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న విద్యుత్ రాయితీని యూనిట్‌కు రూ.1.50కు అందించేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆక్వా సాగులో విద్యుత్ వ్యయం రైతులకు ప్రధాన భారంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గి రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
ఆక్వా రంగానికి ప్రభుత్వం అండ :
ఆక్వా రైతుల సంక్షేమం, రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కోళ్ల నాగేశ్వరరావు (కెఎన్ఆర్) పేర్కొన్నారు. విద్యుత్ రాయితీతో ఆక్వా రైతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, రాష్ట్రంలో ఆక్వా సాగు మరింత అభివృద్ధి చెందేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు.
ఈ సదస్సు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ నాగరాణి, AP IIIC ఛైర్మన్ మంతెన రామరాజు, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆక్వా రైతుల సమస్యలు, ప్రభుత్వ రాయితీలు, విద్యుత్ సౌకర్యాలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతుందని కోళ్ల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

