The Desk … Nandigama : ▪️డోర్ టు డోర్▪️

The Desk … Nandigama : ▪️డోర్ టు డోర్▪️

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

గడపగడపకూ సంక్షేమం – ఇంటింటికీ అభివృద్ధి

సంక్షేమం ప్రతి గడపకు – అభివృద్ధి ప్రతి కుటుంబానికి

నందిగామలో ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, గద్దె అనురాధ

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నందిగామ పట్టణం 6వ వార్డులో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నందిగామ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, స్త్రీ శక్తి కార్యక్రమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలను ప్రజలకు వివరించారు.

సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధితో పాటు గ్రామాలు, పట్టణాల్లో రహదారులు, తాగునీరు, ప్రజా సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగుతోందని పేర్కొన్నారు.

Welfare at Every Doorstep, Development for Every Family
➖MLA SOUMYA

The ruling alliance government’s welfare and development initiatives over the past two years were taken to the people through a door-to-door campaign held in the sixth ward of Nandigama town on Thursday.

Government Whip and Nandigama MLA Tangirala Soumya, along with NTR district TDP president Gadde Anuradha and alliance leaders, participated in the campaign and interacted with residents.

The leaders visited households and distributed pamphlets detailing various welfare schemes and development programmes being implemented in the Nandigama constituency. They explained the benefits of initiatives including the free LPG cylinder scheme, Stree Shakti programme and infrastructure development works.

Speaking on the occasion, Ms Soumya said the government was according equal importance to welfare and development under the leadership of Chief Minister N. Chandrababu Naidu.

She said the government was focusing on the development of the Amaravati Economic Region while simultaneously strengthening basic infrastructure and public services in villages and towns. Improving roads, drinking water facilities and access to essential public services remained among the government’s priorities, she said.

The MLA said the door-to-door outreach was aimed at informing people about the welfare measures and development works taken up by the coalition government during its two-year tenure.