The Desk … Eluru : ▪️కూత కెళ్ళిన కృష్ణయ్య▪️

The Desk … Eluru : ▪️కూత కెళ్ళిన కృష్ణయ్య▪️

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

రాష్ట్ర స్థాయిలో ఏలూరు క్రీడాఖ్యాతి ఇనుమడించాలి

క్రీడాకారులకు ప్రోత్సాహక నగదు బహుమతులు
➖ఎమ్మెల్యే చంటి

రాష్ట్రస్థాయిలో ఏలూరు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసేలా యువ క్రీడాకారులు ప్రతిభ చాటాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని బహుమతుల రూపంలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026లో భాగంగా గురువారం ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే బడేటి చంటి, శాప్‌ డైరెక్టర్‌ జగదీశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు ప్రత్యేక కోటా అమలు చేస్తున్నట్లు చెప్పారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. అమరావతి ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రస్థాయిలో విజయం సాధించే ఏలూరు జిల్లా క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తామని ప్రకటించారు.
మొత్తం 12 విభాగాల్లో నిర్వహించిన ఎంపికల్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మామిళ్లపల్లి పార్థసారథి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బడేటి వెంకట్రామయ్య, వెయిట్‌లిఫ్టింగ్‌ రాష్ట్ర కార్యదర్శి దీన్షాబాబు, డీఎస్‌డీవో అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.