The Desk … Mudinepalli : నిరుపేద వృద్ధుల అంత్యక్రియలకు అండగా వైష్ణవి

The Desk … Mudinepalli : నిరుపేద వృద్ధుల అంత్యక్రియలకు అండగా వైష్ణవి

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్

వెన్న కమలమ్మ కుటుంబస్తులకు 5000/-

బొజ్జ మరియమ్మ కుటుంబస్తులకు 5000/-

డాక్టర్ మనోజ్, అంబుల వైష్ణవి వితరణ

ముదినేపల్లి మండలంలోని రెండు గ్రామాల్లో అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద వృద్ధుల కుటుంబాలకు సామాజిక సేవకురాలు, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి మానవత్వాన్ని చాటుతూ ఆర్థిక సాయం అందించారు.

మండలంలోని దాకారం గ్రామానికి చెందిన వెన్న కమలమ్మ (80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. భర్తను కోల్పోయిన ఆమె తన నిరుపేద కుమారుడి వద్ద నివసిస్తూ జీవనం సాగించేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న వైష్ణవి అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.5,000 నగదు సాయం తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా అందించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అదే విధంగా ముదినేపల్లి గ్రామానికి చెందిన బొజ్జ మరియమ్మ (80) కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఆమె మరణంతో స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైష్ణవి స్పందించి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా అందజేశారు.

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవీయ విలువలను చాటుతున్న వైష్ణవి ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ సేవలను గ్రామస్తులు అభినందించారు. కష్టకాలంలో అందించిన ఈ సహాయం బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిచ్చిందని స్థానికులు పేర్కొన్నారు.