The Desk …Kaldari : ▪️ప్లాస్టిక్ – ఫ్రీ స్టేట్▪️

The Desk …Kaldari : ▪️ప్లాస్టిక్ – ఫ్రీ స్టేట్▪️

🔴 తూగో జిల్లా : ఉండ్రాజవరం మండలం : కాల్దారి : ది డెస్క్ :

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా… “ప్లాస్టిక్-ఫ్రీ స్టేట్” కార్యక్రమాన్ని శనివారం కాల్దారి గ్రామంలో నిర్వహించారు.

ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే హానిపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ… ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని అధికారులు తెలిపారు. వాడేసి పారేసే ప్లాస్టిక్ కారణంగా భూమి కాలుష్యానికి గురవడంతో పాటు, కాలువలు మూసుకుపోయి నీటి నిల్వలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను తినే పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని, ప్లాస్టిక్ దహనం వల్ల విషవాయువులు విడుదలై ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అవగాహన కల్పించారు.

నివారణ :

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, బట్ట సంచులు మరియు పర్యావరణ హిత వస్తువులను వినియోగించాలని సూచించారు.

ఈ కార్యక్రమoలో పంచాయతీ కార్యదర్శి వి శ్రీనివాసరావు, గ్రామ కూటమి నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్, హెల్త్ డిపార్ట్మెంట్, డ్వాక్రా మహిళలు,అంగన్వాడీ సిబ్బంది ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.