🟡 ఏలూరు జిల్లా: ఏలూరు : ది డెస్క్ :
నేవీ డిపో ఏర్పాటుకు సీఎం, లోకేష్‌తో చర్చిస్తా
➖ఎంపీ పుట్టా మహేష్
కొయ్యలగూడెం ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఆదివారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో కొయ్యలగూడెం రైతులు, నేతలు ఆయనను కలిసి నేవీ ఆయుధ డిపోను అక్కడే ఏర్పాటు చేయాలని కోరారు. 90 శాతం మంది రైతులు అనుకూలంగా ఉన్నారని వివరించారు. స్పందించిన ఎంపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో చర్చించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఫైర్‌స్టేషన్‌తో పాటు రోడ్లు, డ్రైనేజీలు, స్మశానవాటికల అభివృద్ధిపైనా దృష్టి పెడతానన్నారు.
అదనపు పొగాకు కొనుగోళ్లకు అనుమతి ఇప్పించేందుకు కృషి :
కేంద్రంతో మాట్లాడతా :
అదనంగా పండిన పొగాకు కొనుగోళ్లకు అనుమతి ఇప్పించేందుకు కేంద్రం, పొగాకు బోర్డుతో మాట్లాడతానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరులో ఆయనను కలిసిన పొగాకు రైతులు అదనపు కోటా, DAP, యూరియా ప్రత్యేక కోటా కల్పించాలని కోరారు. ప్రస్తుతం పొగాకు ధర కిలో రూ.345 వరకు చేరిందని రైతులు తెలిపారు. ధరలు మరింత మెరుగుపడేలా బోర్డు, కంపెనీలతో చర్చిస్తున్నానని ఎంపీ చెప్పారు. DAP, యూరియా సమస్యపై వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

