The Desk… Eluru : ‎ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో బడేటి చంటి భేటీ

The Desk… Eluru : ‎ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో బడేటి చంటి భేటీ

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :


‎ఆదివారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంకు వచ్చిన జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఎంపీతో భేటీ అయ్యారు. ‎ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో బడేటి చంటి భేటీ

ఆదివారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంకు వచ్చిన జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఎంపీతో భేటీ అయ్యారు.

దాదాపు అరగంట సేపు జరిగిన ఈ భేటీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ, కూటమి నేతల మధ్య సమన్వయం, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది.

గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు ఎంపీ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.