🟡 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :
అమరావతి అభివృద్ధికి భూ వరాహ సుదర్శన మహాయజ్ఞం
రాజధానికి ప్రజాబలం
అమరావతి కోసం మహా సంకల్పం
రాజధాని ప్రగతికి మహాయజ్ఞం
అమరావతి అభివృద్ధికి ఇంటింటి చేయూత
రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
➖డాక్టర్ అంబుల మనోజ్
అమరావతి రాజధాని అభివృద్ధి వేగవంతంగా సాగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ భూ వరాహస్వామి జయంతి సందర్భంగా.. భూ వరాహ సుదర్శన మహాయజ్ఞాన్ని నిర్వహించారు. మండలంలోని పురోహితులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా అమరావతి అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ అంబుల మనోజ్ మాట్లాడుతూ :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అంబుల వైష్ణవి సంకల్పానికి అనుగుణంగా అమరావతి రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తయి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మహాయజ్ఞాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అమరావతి అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరూ భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటి నుంచి రూ.116/- విరాళం :
అమరావతి నిర్మాణానికి ప్రతి ఇంటి నుంచి రూ.116 చొప్పున విరాళంగా అందించి రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలంతా చేయి చేయి కలిపి అమరావతి నిర్మాణానికి అండగా నిలవాలని అన్నారు. రాబోయే రోజుల్లో మన పిల్లలు అమరావతిలోనే విద్యాభ్యాసం చేసి, ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా రాజధాని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు అమరావతిలో పెట్టుబడులు పెట్టి రాజధాని ప్రగతికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.
అమరావతి అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ మహాయజ్ఞానికి ప్రజల భాగస్వామ్యం, భగవంతుని ఆశీస్సులు కొనసాగాలని డాక్టర్ మనోజ్ ఆకాంక్షించారు.

