🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఆపన్నులకు అండగా నిలవాలి
సేవా స్ఫూర్తి మరింత పెరగాలి
పేదలకు చేయూతే నిజమైన సేవ
దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు
– ఎమ్మెల్యే బడేటి చంటి
అవసరార్థులకు అండగా నిలిచేందుకు ప్రజల్లో సేవా గుణం మరింత పెంపొందాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఆదివారం రామచంద్రరావుపేట మాగంటి వారి వీధిలోని హేలాపురి ఆర్ష సేవా సమితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతినెలా 50 మంది నిరుపేదలకు రూ.500 చొప్పున పెన్షన్ అందిస్తున్న సమితి సేవలను ఆయన అభినందించారు.
తాను కూడా దాతల సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు, మందుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని పవర్‌పేట రైల్వేగేటు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసురాలు, నాట్యాచారిణి మైలవరపు వెంకట దివ్యభారతితో పాటు ఎమ్మెల్యే బడేటి చంటిని సమితి తరఫున సన్మానించారు. అనంతరం పేద వృద్ధులకు నెలవారీ పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

