🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
డోర్ టు డోర్ – 31 డివిజన్
రెండేళ్ల కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతోపాటు వారి సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటి ప్రచారం దోహదపడుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు 31వ డివిజన్ పత్తేబాదలో గురువారం నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రజలను కలుసుకుని కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
స్థానికుల నుంచి రహదారి సమస్యను తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొత్త పెన్షన్లపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొందని, అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నామని చంటి తెలిపారు.

