The Desk … Eluru : దేశ ప్రగతికి సమైక్యంగా కృషి చేద్దాం

The Desk … Eluru : దేశ ప్రగతికి సమైక్యంగా కృషి చేద్దాం

🟡 న్యూఢిల్లీ/ఏలూరు: ది డెస్క్ :

ఏలూరు పార్లమెంటు ప్రజలకు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఏలూరు పార్లమెంటు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత 79 ఏళ్లలో భారత్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రపంచ అగ్రదేశాల సరసన నిలవడం గర్వకారణమన్నారు. కుల, మత, వర్గాల పేరుతో అశాంతిని సృష్టించే శక్తులను తిప్పికొట్టాలని కోరారు.

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలో దేశ, రాష్ట్ర సమగ్రత, భద్రత, ప్రగతికి సమైక్యంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.