🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం
➖MLA సౌమ్య
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శుక్రవారం నందిగామ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులందరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

