The Desk … Nandigama : నందిగామ మెయిన్ పోస్టాఫీసుకు కొత్త భవనం

The Desk … Nandigama : నందిగామ మెయిన్ పోస్టాఫీసుకు కొత్త భవనం

🟡 విజయవాడ : ది డెస్క్ :

ప్రజా అవసరాల దృష్ట్యా ఎంపీ చిన్ని దృష్టికి ఎమ్మెల్యే సౌమ్య

నందిగామ పట్టణంలోని మెయిన్ పోస్టాఫీసుకు అన్ని మౌలిక వసతులతో నూతన భవనం మంజూరు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడ ఆటోనగర్‌లోని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని)కు ప్రజాసంఘాల ప్రతినిధులు, కూటమి నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుత పోస్టాఫీసు భవనం ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని, నందిగామతో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సౌమ్య వివరించారు. నూతన భవనం నిర్మిస్తే మెరుగైన పోస్టల్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తారని నాయకులు పేర్కొన్నారు.

New Building Sought for Nandigama Main Post Office

Government Whip and Nandigama MLA Tangirala Sowmya has urged MP Kesineni Sivanath (Chinni) to facilitate the sanction of a new building with modern infrastructure for the Nandigama Main Post Office.

Sowmya, accompanied by representatives of public organisations and coalition leaders, submitted a representation to the MP at the NTR district TDP office in Auto Nagar, Vijayawada, on Friday.

She pointed out that the existing post office building was inadequate to meet the growing needs of the public. Residents of Nandigama and people visiting the office from various parts of the constituency were facing difficulties due to the limited infrastructure and space.

The MLA said that a new, well-equipped building would help improve postal services and provide greater convenience to the public. She urged the MP to take up the issue with the concerned authorities and ensure that the proposal receives due consideration.

Coalition leaders said that elected representatives were working in coordination with a focus on addressing public concerns and strengthening essential infrastructure in the constituency.