🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

పేదల వైద్యానికి రూ.76.81 లక్షల భరోసా
ఆపదలో ఆదుకుంటాం
ఆరోగ్యానికి అండగా!
పేదల ఆరోగ్యానికి కూటమి సర్కారు భరోసా
వైద్య ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్ అండ
62 కుటుంబాలకు వైద్య సాయం.. రూ.76.81 లక్షలు
పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి అన్నారు. ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎంఆర్‌ఎఫ్ సాయం పంపిణీ చేశారు.
వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 55 మందికి రూ.49.80 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, మరో 7 మందికి రూ.27.01 లక్షల విలువైన ఎల్‌వోసీలను ఎమ్మెల్యే అందజేశారు. బాధితులకు భరోసా కల్పిస్తూ, వైద్య చికిత్సకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని బడేటి చంటి పేర్కొన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 778 మందికి రూ.7.12 కోట్లకు పైగా సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించినట్లు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నామని వెల్లడించారు.

