The Desk… Eluru : రాష్ట్రాల వారీగా వ్యవసాయ రోడ్‌మ్యాప్‌లు➖ఎంపీ పుట్టా మహేష్

The Desk… Eluru : రాష్ట్రాల వారీగా వ్యవసాయ రోడ్‌మ్యాప్‌లు➖ఎంపీ పుట్టా మహేష్

🟡 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

ఆంధ్రప్రదేశ్‌కూ ప్రత్యేక వ్యవసాయ రోడ్‌మ్యాప్

రైతు ఆదాయమే లక్ష్యం

దేశంలోని వివిధ రాష్ట్రాల వ్యవసాయ-వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక వ్యవసాయ రోడ్‌మ్యాప్‌లు రూపొందిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

అస్సాం, గోవా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్‌-నికోబార్ దీవులకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు ప్రారంభించినట్లు వెల్లడించారు. రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత–లాభదాయకత మెరుగుదల, వనరుల సమర్థ వినియోగం, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, గ్రామీణ ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ రోడ్‌మ్యాప్‌లు రూపొందుతున్నాయని తెలిపారు.

ఐసీఏఆర్, కేంద్ర–రాష్ట్ర వ్యవసాయ శాఖలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, నిపుణుల సమన్వయంతో రోడ్‌మ్యాప్‌లను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివరించారు.