🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

టవల్స్, దుప్పట్లు, స్వెట్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి
విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాల కల్పనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి తెలిపారు. ఏలూరు అమీనాపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో సోమవారం విద్యార్థినులకు టవల్స్, దుప్పట్లు, స్వెట్టర్లు, నైట్ డ్రస్సులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
హాస్టళ్లలో ఉండే విద్యార్థినుల భద్రత, సౌకర్యాల మెరుగుదలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వసతి గృహాల్లోని మౌలిక వసతులపై విద్యార్థినులను అడిగి తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని విద్యార్థినులకు సూచించారు.

