🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చర్చ
మోదీ పర్యటన విజయవంతానికి సమన్వయం
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) శుక్రవారం విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సీహెచ్. వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌ను కలిశారు. ప్రారంభోత్సవ కార్యక్రమ విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, సమన్వయంపై చర్చించారు.
ఈ సమావేశంలో టీడీపీ నాయకుడు చల్లా వెంకట సత్య వరప్రసాదరావు (కంప్యూటర్ ప్రసాద్) పాల్గొన్నారు.

