🔴 పగో : భీమవరం : ది డెస్క్ :

అన్నప్రసాద సేవకు బిల్డర్స్ చేయూత
మావుళ్లమ్మ సేవలో బిల్డర్స్ అసోసియేషన్
మావుళ్లమ్మ దేవస్థానంలో శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణ కోసం భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గన్నాబత్తుల శ్రీనివాస్‌తో పాటు వడుపు గోపి, గ్రంధి రవితేజ, ఎర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణ తదితర 23 మంది మిత్రబృందం సంయుక్తంగా ₹3,15,000 విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, అరసవల్లి సుబ్రమణ్యం, పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపికలను అందించి సత్కరించారు.

