🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
అక్షర స్కూల్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసే కార్యక్రమం ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (APBJA) ఆధ్వర్యంలో, అక్షర స్కూల్స్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బ్యాగులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యా ప్రోత్సాహం అందిస్తున్న అక్షర స్కూల్స్ చైర్మన్ సురేంద్ర, డైరెక్టర్ అర్చన చౌదరిని ఎమ్మెల్యే అభినందించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న APWJF, APBJA సంఘాల సేవలను కూడా ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
School Bags Distributed to Journalists’ Children
Program Organized by Akshara Schools
MLA Badeti Chanti Attends as Chief Guest
On the occasion of the commencement of the new academic year, a school bag distribution program for the children of journalists was organized in Eluru. The event was conducted under the aegis of the Andhra Pradesh Working Journalists Federation (APWJF) and the Andhra Pradesh Broadcast Journalists Association (APBJA), with the support of Akshara Schools.
Badeti Chanti, MLA of Eluru, attended the event as the Chief Guest and distributed school bags to the students.
Speaking on the Occasion, MLA Chanti Said :
Journalists are the fourth pillar of democracy, and the government remains committed to their welfare. He appreciated Surendra, Chairman of Akshara Schools, and Archana Chowdary, Director of Akshara Schools, for supporting the education of journalists’ children through this initiative.
He also commended the efforts of Andhra Pradesh Working Journalists Federation and Andhra Pradesh Broadcast Journalists Association for their continued work in addressing the issues and welfare of journalists.
The program was attended by leaders of journalists’ associations, media representatives, students, and their parents.

