🟡 ఏలూరు జిల్లా : ఎమ్మెల్యే కార్యాలయం : ది డెస్క్ :
అవసరార్థులకు వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ
రూ.50 వేల విలువైన మందులు అందజేసిన దాతలు
ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పలువురు రోగులకు వైద్య సేవలు అందించారు. శిబిరంలో భాగంగా వైద్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించగా, వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

శిబిరాన్ని పరిశీలించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. సామాజిక సేవలో భాగంగా ఏలూరుకు చెందిన వ్యాపారవేత్తలు గ్రంథి అమరేంద్ర, అంబికా అనసూయ దంపతులు రూ.50 వేల విలువైన మందులను శిబిరానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. సేవా కార్యక్రమాల నిర్వహణకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Free Medical Camp Held at MLA Camp Office
Medical Check-ups and Free Medicines Provided to Beneficiaries
Donors Contribute Medicines Worth ₹50,000
A free medical camp was organized on Thursday at the MLA Camp Office in Powerpet,
Eluru, where medical services were provided to several patients. As part of the camp, medical staff conducted blood tests, while doctors examined patients and distributed the required medicines free of cost.
Eluru MLA Badeti Chanti visited the camp and offered several suggestions to the medical staff regarding the conduct of the program.
As part of their commitment to social service, Eluru-based entrepreneurs Granthi Amarendra and Ambika Anasuya donated medicines worth ₹50,000 to support the camp. On the occasion, the MLA appreciated and congratulated the donors for their generous contribution.
The MLA also called upon more philanthropists and donors to come forward and support such welfare and service-oriented initiatives for the benefit of the community.

