The Desk … Eluru : నాదెండ్ల భాస్కరరావుకు ఎంపీ పుట్టా మహేష్ నివాళి

The Desk … Eluru : నాదెండ్ల భాస్కరరావుకు ఎంపీ పుట్టా మహేష్ నివాళి

🟡 హైదరాబాద్/ఏలూరు : ది డెస్క్ :

అనారోగ్యంతో హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని నాదెండ్ల నివాసానికి చేరుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్,  భాస్కరరావు పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం నాదెండ్ల భాస్కరరావు కుమారుడు, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

‎MP Putta Mahesh Kumar pays tribute to Nadendla Bhaskara Rao

Eluru MP Putta Mahesh Kumar paid tribute to former Chief Minister Nadendla Bhaskara Rao, who passed away on Wednesday while undergoing treatment at a private hospital in Hyderabad due to illness. MP Putta Mahesh Kumar, who reached Nadendla’s residence in Jubilee Hills on Thursday morning, paid tribute by placing a floral wreath on Bhaskara Rao’s mortal remains. Later, he visited Nadendla Bhaskara Rao’s son and AP Civil Supplies Minister Nadendla Manohar and their family members and expressed his deepest condolences.