The Desk … Eluru : ప్రజల సంతృప్తే కూటమి పాలనకు కొలమానం➖ ఎమ్మెల్యే చంటి

The Desk … Eluru : ప్రజల సంతృప్తే కూటమి పాలనకు కొలమానం➖ ఎమ్మెల్యే చంటి

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

డోర్ టు డోర్ 8వ డివిజన్

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలు ప్రశాంతంగా, సంతృప్తికరంగా జీవిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు 8వ డివిజన్‌లో శుక్రవారం నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.

ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. దుకాణదారులు, చుట్టల కార్మికులను కలసి వారి సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. డివిజన్‌లో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్‌-1 నియామకాల్లో జరిగిన అక్రమాలపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.