The Desk … Nandigama : కంచికచర్లలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’.. దేశభక్తి వెల్లువ

The Desk … Nandigama : కంచికచర్లలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’.. దేశభక్తి వెల్లువ

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గం : కంచికచర్ల :

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కంచికచర్లలో నిర్వహించిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ దేశభక్తి నినాదాలతో హోరెత్తింది. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నేతృత్వంలో విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి బంక్‌ సెంటర్‌ వరకు సాగిన ర్యాలీలో ‘వందేమాతరం’, ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాలు మార్మోగాయి.

అనంతరం బంక్‌ సెంటర్‌లో నిర్వహించిన మానవహారంలో ఎమ్మెల్యే సౌమ్య పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత తదితరులు పాల్గొన్నారు.