🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి భీమవరంకి చెందిన ముప్పిరిశెట్టి నాగరాజు జయశ్రీ దంపతులు 8 గ్రాముల బంగారం విరాళంగా అందచేసినారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించి శేషవస్త్రం మరియు ధర్మకర్తలు వుదిశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్ గొంతెన రమణ జ్ఞాపిక, ప్రసాదం అందించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

