The Desk … Bhimavaram : టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన KNR కు అభినందనలు వెల్లువ

The Desk … Bhimavaram : టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన KNR కు అభినందనలు వెల్లువ

KNR ను అభినందించిన MRPS నాయకులు, కూటమి నాయకులు

🟡 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కోళ్ల నాగేశ్వరరావును శనివారం వారి నివాసంలో ఎంఆర్ పిఎస్ నాయకులు, కూటమి నాయకులు, ఎంపీటీసీలు అభినందించారు. తెలుగుదేశం పార్టీ పట్ల కోళ్ల నాగేశ్వరరావుకు ఉన్న నిబద్ధత క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలే ఆయనకు మరోసారి రాష్ట్ర స్థాయిలో పదవులు అందుకునేలా చేశాయన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కోళ్ల నాగేశ్వరావుని రెండవసారి అధిష్టానం నియమించడం హర్షించదగ్గ విషయమన్నారు.

టిడిపికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని, పార్టీ బలోపేతానికి కృషి ప్రశంసనీయమన్నారు. పార్టీ కోసం సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండాలని కూటమిను మరింత బలపరచాలని ఆకాంక్షించారు. అనంతరం నాగేశ్వరరావును సత్కరించారు.

ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ :..అందరిని కలుపుకొని కూటమి నాయకులతో సమన్వయంతో పని చేస్తానన్నారు.