The Desk … Nandigama : నందిగామ మున్సిపాలిటీకి ఉచితంగా ట్రాక్టర్, మంచినీటి ట్యాంకర్ అందజేత

The Desk … Nandigama : నందిగామ మున్సిపాలిటీకి ఉచితంగా ట్రాక్టర్, మంచినీటి ట్యాంకర్ అందజేత

కాంట్రాక్టర్ సేవాభావానికి అభినందనలు తెలిపిన వసంత నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

🔴 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

నందిగామ పట్టణం కమ్మ కళ్యాణ మండపం నందు శుక్రవారం నాడు కాంట్రాక్టర్ పాలేటి సతీష్ సౌజన్యంతో నందిగామ మున్సిపల్ కార్యాలయానికి ట్రాక్టర్ మరియు రక్షిత మంచినీటి ట్యాంకర్‌ను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని మున్సిపాలిటీ అధికారులకు వాహనాలను అధికారికంగా అందించారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ :

ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు, తాగునీటి సరఫరా అందించడంలో ఈ ట్రాక్టర్ మరియు మంచినీటి ట్యాంకర్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సమాజ సేవా దృక్పథంతో మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన కాంట్రాక్టర్ పాలేటి సతీష్ ప్రత్యేకంగా అభినందించారు. నందిగామ పట్టణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, దాతలు కలిసి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, వివిధ రాష్ట్ర కార్పోరేషన్ డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.