The Desk … Tadepalligudem : వదంతులను నమ్మవద్దు..పంపులు చెరువులో నీటి నిల్వలు పుష్కలం➖ యేసుబాబు (కమిషనర్)

The Desk … Tadepalligudem : వదంతులను నమ్మవద్దు..పంపులు చెరువులో నీటి నిల్వలు పుష్కలం➖ యేసుబాబు (కమిషనర్)

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పట్టణానికి ప్రధాన నీటి వనరు అయిన పంపుల చెరువును ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, డి.ఈ, ఏ.ఈ లు క్షేత్రస్థాయిలో సందర్శించారు.

సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు మాట్లాడుతూ :

పంపుల చెరువులో ప్రస్తుతం పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయని, తాడేపల్లిగూడెం పట్టణంలో ఎక్కడా నీటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలకు నీటి సరఫరా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని తెలిపారు.

అయితే వేసవి కాలం దృష్ట్యా ప్రజలందరూ నీటిని అత్యంత పొదుపుగా, బాధ్యతాయుతంగా వాడుకోవాలని, నీటిని వృథా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా కుళాయిలు వదిలేయడం, రోడ్లపై నీటిని పారబోయడం వంటివి చేయవద్దని సూచించారు.

నీటి కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో, ప్రజల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కమిషనర్ కోరారు. అధికారిక సమాచారం కోసం మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. నీటి సరఫరాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే మున్సిపల్ వాటర్ వర్క్స్ విభాగానికి తెలియజేయాలని కోరారు.

పట్టణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు మున్సిపాలిటీ అన్ని చర్యలు తీసుకుంటోందని, ఇంజనీరింగ్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని డి.ఈ, ఏ.ఈ లు వివరించారు.

Tadepalligudem Municipal Commissioner Assures Ample Water Supply, Urges Conservation Amid Rumours

Dismissing social media rumours of water scarcity, Municipal Commissioner M. Yesubabu inspected Pumpul Cheruvu, the town’s primary water source, today. Accompanied by municipal engineering officials, DEE, and AEEs, he confirmed abundant water reserves, ensuring no shortages in the town.

“Water supply is fully operational for residents. Ignore baseless rumours—contact the municipal office for verified info,” Yesubabu stated during the field visit. He appealed to citizens to use water judiciously this summer, avoiding waste like leaving taps open or spilling on roads.

Engineering staff are continuously monitoring to provide safe drinking water, officials added. Residents facing issues should promptly report to the Municipal Water Works department.

The assurance comes amid rising summer heat, emphasizing responsible usage to sustain supplies.