The Desk… International: హిమాలయ శిఖరారోహణకు సన్నద్ధం – ఎస్‌ఐ వెంకటేశ్వరరావు విజయవంతమైన శిక్షణ

The Desk… International: హిమాలయ శిఖరారోహణకు సన్నద్ధం – ఎస్‌ఐ వెంకటేశ్వరరావు విజయవంతమైన శిక్షణ

కలిదిండి : ఇంటర్నేషనల్ డెస్క్ :

కలిదిండి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు హిమాలయ పర్వతారోహణకు సన్నద్ధమవుతూ ప్రతిష్టాత్మక శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.

డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 28 రోజులపాటు కఠినమైన శిక్షణ పొందారు. ఈ శిక్షణలో భాగంగా యుక్సోం నుండి 20 కిలోల బరువుతో వెస్ట్ సిక్కిం ప్రాంతం గుండా నేపాల్ సరిహద్దులో ఉన్న హెచ్‌ఎమ్‌ఐ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ చేశారు.

14500 అడుగుల ఎత్తులో -25 డిగ్రీల తీవ్ర చలిలో గ్లేసియర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. అనంతరం 16500 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ రెనోక్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు.

ఈ విజయంతో హిమాలయ పర్వతారోహణలో మరింత ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు.