🟡 శ్రీకాళహస్తి/ఏలూరు : ది డెస్క్ న్యూస్ :
జ్ఞాన ప్రసూనాంబా సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఎమ్మెల్యే చంటి
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) శుక్రవారం ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కార్తీక మాసంలో విశేష ప్రాధాన్యత కలిగిన శైవక్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి ఆలయంలో స్వామి, అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో జర్రిపోతుల సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.

